క్రిష్ ప్లాన్.. ఐదుగురు హీరోయిన్లతో సినిమా!

15చూసినవారు
క్రిష్ ప్లాన్.. ఐదుగురు హీరోయిన్లతో సినిమా!
దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి, 'గమ్యం', 'వేదం', 'కంచె' వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, గత కొన్నేళ్లుగా ఆయన కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. దీంతో, తన గత వైభవాన్ని తిరిగి పొందడానికి క్రిష్‌ కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. ఈసారి కాస్టింగ్‌పై కాకుండా కథపైనే ఎక్కువ దృష్టి సారించి, అయిదుగురు అమ్మాయిల నేపథ్యంతో కూడిన విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ ఐదు ప్రధాన పాత్రలకు ఐదుగురు యంగ్‌ హీరోయిన్లను ఎంపిక చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్