హోటల్ గదిలో ఆత్మను చూశా: కృతి శెట్టి సంచలన వ్యాఖ్యలు

7408చూసినవారు
హోటల్ గదిలో ఆత్మను చూశా: కృతి శెట్టి సంచలన వ్యాఖ్యలు
తాను హోటల్ గదిలో ఆత్మను చూశానని హీరోయిన్ కృతి శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తీ 'వా వాతియర్' సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు రోజు రాత్రి, తన తల్లితో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఈ అనుభవం ఎదురైందని ఆమె తెలిపారు. లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చి, ఆత్మ అదృశ్యమైందని ఆమె పేర్కొన్నారు. తాను పూర్వీకులను దేవతలుగా పూజించే తుళు జాతికి చెందిన వారిమని, ఆత్మలపై నమ్మకం ఉందని తెలిపింది. వారు తమను కాపాడుతుంటారని ఆమె చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్