RCB ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య తన కొడుకు కవీర్‌తో కలిసి ఐపీఎల్ విజయోత్సవాల్లో సందడి చేశాడు. గ్రౌండ్‌లో చిన్నపిల్లాడిలా మోకాళ్లపై కూర్చొని అతడితో ఆడుకుంటూ గులాబీ రేకులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ మధురమైన క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో భువనేశ్వర్ కుమార్ కూడా తన భార్య నుపుర్, కూతురు అక్షతో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.