KSRTC బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

36చూసినవారు
KSRTC బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున KSRTC బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. రాయచూరు నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు చల్లకెరె తాలూకాలోని హెగ్గరె సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చల్లకెరె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్