TG: వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో
కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అప్పులపై స్పీకర్ చెబుతున్న లెక్కలు అబద్దాలని ఆయన మండిపడ్డారు. స్పీకర్ తన గౌరవాన్ని తగ్గించుకుంటున్నారని,
కేసీఆర్ 10 ఏళ్లలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేశారని కేంద్ర ప్రభుత్వ లెక్కలను ఉటంకిస్తూ
కేటీఆర్ తెలిపారు. స్పీకర్ రూ.8 లక్షల కోట్లు, డిప్యూటీ సీఎం రూ.9 లక్షల కోట్లు అంటున్నారని, నోటికి ఎంత వస్తే అంత చెబుతున్నారని ఆయన విమర్శించారు.