TG: సవాళ్లు విసిరి పారిపోవడం కేటీఆర్‌కు అలవాటేనని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఆయన విసిరే సవాళ్లను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పట్టించుకోరని అన్నారు. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ ప్రచారంలో మాట్లాడుతూ.. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులపై జీవోలు ఇస్తామని, కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని అన్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్‌రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.