TG: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్‍రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవన్‍రెడ్డిని BRSలో ఆహ్వానించారు. అనంతరం KTR మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సూచన మేరకు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్‍లోకి ఆహ్వానించామన్నారు. దీనికి బీఆర్ఎస్ నేతలంతా సహకరించారని తెలిపారు. జీవన్‍రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, కేసీఆర్‍తో ఆయనకు 4 దశాబ్దాల పరిచయం, స్నేహం ఉందని తెలిపారు. కాగా కేసీఆర్‍ను కలిసిన తర్వాత తన నిర్ణయం చెబుతానని జీవన్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.