మేడే రోజు కేటీఆర్ బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు: అద్దంకి
By Anjayya 1చూసినవారుబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మేడే రోజు కేటీఆర్ బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని, సందర్భానుసారంగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవుపలికారు. మూడేళ్లయినా ముఖ్యమంత్రి పని చేయడం లేదని కేటీఆర్ అంటున్నారని, పదేళ్లు పని చేయని సీఎంను ఏమనాలని ప్రశ్నించారు. ప్రజా నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎదుగుతున్న తీరు నచ్చకే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు.