
ఇంగ్లీష్ రాక పరువు తీసుకున్న పాకిస్తాన్ ఆటగాడి ట్రాన్స్ లేటర్
హాంగ్‌కాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో కువైట్‌ను ఓడించి ఆరోసారి టైటిల్ గెలుచుకుంది. అయితే, విజయం తర్వాత ఆటగాడు అబ్బాస్ అఫ్రిది ఇంగ్లీష్ రాని ట్రాన్స్ లేటర్ సహాయంతో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ట్రాన్స్ లేటర్ సరిగ్గా ఇంగ్లీష్ అనువదించకపోవడంతో, యాంకర్ అడిగిన ప్రశ్నకు సంబంధం లేని సమాధానాలు చెప్పి పరువు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.




