తెలంగాణ భవన్‌లో బుధవారం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై 'వెయ్యి రోజుల దగా పాలన' పేరుతో చార్జ్‌షీట్ విడుదల చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో
కాంగ్రెస్ విఫలమైందని, అలవికాని హామీలిచ్చి మోసం చేసిందని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ తెలియదని, బూతులు మాట్లాడటం తప్ప ఏమీ రాదని
కేటీఆర్ విమర్శించారు. గురుదక్షిణ చెల్లించుకోవడం కోసం రేవంత్ రెడ్డి గోదావరి, కృష్ణా జలాలను ఏపీకి ధారపోస్తున్నారని దుయ్యబట్టారు.