రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌కు కేటీఆర్ లేఖ

13చూసినవారు
రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌కు కేటీఆర్ లేఖ
TG: రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. కేటీఆర్ లేఖను అశ్వినీవైష్ణవ్‌కు బీఆర్‌ఎస్‌ ఎంపీలు అందజేయగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కాజీపేట రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని, దీని వల్ల కార్యకలాపాల వికేంద్రీకరణ జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణలో రైల్వే సేవలు మెరుగుపడతాయని, 2,755 కి.మీ. రైల్వే లైన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. కేవలం 900 కి.మీ. పరిధి ఉన్న గుంటూరును ప్రత్యేక డివిజన్‌గా చేశారని లేఖలో గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్