నాని ‘ప్యారడైజ్‌’పై కేటీఆర్‌ రివ్యూ

7చూసినవారు
నాని ‘ప్యారడైజ్‌’పై కేటీఆర్‌ రివ్యూ
నాని ‘ది ప్యారడైజ్‌’ చిత్రాన్ని మాజీ మంత్రి KTR వీక్షించారు. హైదరాబాద్‌ RTC క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్‌ 35ఎంఎం థియేటర్‌లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో కలిసి సినిమాను చూశారు. అనంతరం ఎక్స్‌ వేదికగా స్పందించిన కేటీఆర్‌.. అస్తిత్వం కోసం ఆరాటం, అణిచివేతపై పోరాటం వంటి అంశాలను సినిమాలో చూపించారని ప్రశంసించారు. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల, కథానాయకుడు నాని, నటుడు ప్రియదర్శికి అభినందనలు తెలిపారు. సమాజంపై అణిచివేత జరిగినప్పుడు ఓ నాయకుడు పోరాడి గుర్తింపు తీసుకొచ్చిన కథకు చక్కటి దృశ్య రూపం ఇచ్చారని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్