TG: కన్నేపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ రానున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. భారీగా తరలివస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. అయితే పార్టీ నేతల నిరసనలతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.