భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ భారత స్క్వాడ్‌లో కుల్దీప్ యాదవ్‌ను తప్పనిసరిగా చేర్చాలని బీసీసీఐకి సూచించాడు. వెస్టిండీస్‌పై తొలి వన్డేలో కుల్దీప్ ప్రదర్శనను ప్రశంసిస్తూ, అతడొక ఛాంపియన్ బౌలర్ అని, అతడు లేకుండా దక్షిణాఫ్రికా వెళ్లడం పొరపాటని అశ్విన్ పేర్కొన్నాడు. తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డేలో కుల్దీప్ నాలుగు వికెట్లు తీసి, మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 30న గువాహటిలో జరుగనుంది.