AP: కర్నూలు బస్సు ప్రమాదంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ 27 మందిపై కేసు నమోదైంది. వీరిలో YCP అధికారిక ఎక్స్ అకౌంట్ నిర్వాహకులు, యాంకర్ శ్యామల, సీవీ రెడ్డి, కందూరి గోపీకృష్ణ వంటివారు ఉన్నారని తెలిసింది. కర్నూలు రూరల్ మండలం తాండ్రపాడుకు చెందిన వేణుములయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కల్తీ మద్యం, బెల్టుషాపులే కారణమని, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.