కర్నూలు ఘటన.. 19వ మృతదేహం గుర్తింపు

193చూసినవారు
AP: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే 18 మంది ప్రయాణికుల మృతదేహాలకు సంబంధించిన వివరాలను పోలీసులు కనుగొన్నారు. 19వ మృతదేహం వివరాలను పోలీసులు గుర్తించలేకపోయారు. తాజాగా డెడ్ బాడీకి సంబంధించిన వివరాలను పోలీసులు గుర్తించారు. 19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల్లో నిర్ధారణ అయింది. అధికారులు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు సమాచారం.