కర్నూలు ఘటన.. ప్రకటన విడుదల చేసిన ఎస్పీ (వీడియో)

56605చూసినవారు
AP: కర్నూలు బస్సు ప్రమాదంపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రకటన విడుదల చేశారు. బైక్‌పై తుగ్గలికి అర్ధరాత్రి 2 గంటలకు శివశంకర్, ఎర్రిస్వామి బయలుదేరారు. చిన్నటేకూరు వద్ద బైక్ స్కిడ్ అయింది. శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డాడు. శివశంకర్ చనిపోయాడనుకుని నిర్ధారించుకునేలోపే రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను బస్సు ఢీకొట్టింది. భయంతో ఎర్రిస్వామి సొంతూరుకు పారిపోయాడు. ఈ మేరకు ఎర్రిస్వామిని పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.