బస్సు ప్రమాద ఘటనను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. "హైదరాబాద్ నుంచి రాత్రి 10.30 గంటలకు బయలుదేరిన బస్సు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చిన్నటేకూరు సమీపంలో బైక్‌ను ఢీకొని మంటలు అంటుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు చిక్కుకుపోయారు. బస్సులో మొత్తం 42 మంది ఉండగా, 20-25 మంది ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడగలిగారు. సుమారు 20 మంది సజీవ దహనమైనట్లు సమాచారం. ప్రమాదం తర్వాత పరారైన డ్రైవర్, సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు" అని తెలిపారు.