
వందేమాతరం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో 'వందేమాతరం' తప్పనిసరిగా పాడాలంటూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది. ఈ సర్క్యులర్ కేవలం సలహా మాత్రమేనని, తప్పనిసరి కాదని, శిక్షార్హమైన చర్యలు లేవని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ఆందోళనలు ఊహాజనితమని, ఒకవేళ ఎవరిపైనైనా శిక్షార్హమైన చర్యలు తీసుకుంటే అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ ఏడాది జనవరి 28న కేంద్రం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.




