TG: కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట ఐడీ (ఫార్మర్ యూనిక్ ఐడీ) కేటాయించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఐడీ ఉంటేనే కేంద్ర పథకాలు రైతులకు అందుతాయి. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 66.34 శాతం మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా 79.54 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, మేడ్చల్ జిల్లా 46.37 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఆదాయపు పన్ను చెల్లించేవారు, అవగాహన లేని చిన్న, సన్నకారు రైతులు రిజిస్ట్రేషన్‌పై ఆసక్తి చూపడం లేదని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు మరో నెల రోజులే గడువు ఉంది.