AP: ఇంద్రకీలాద్రిపై రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభమైంది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రారంభించారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసి క్షణాల్లో లడ్డూ ప్రసాదం పొందేలా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫేక్ పూజా టికెట్లను నమ్మి భక్తులు మోసపోవద్దని కమిషనర్ సూచించారు. దళారుల ప్రమేయాన్ని ఉపేక్షించబోమని, నకిలీ టికెట్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.