ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో యూట్యూబర్‌లుగా గుర్తింపు పొందిన మెహక్, పరి అనే అక్కాచెల్లెళ్లు నడిరోడ్డుపై ఆటో డ్రైవర్‌తో గొడవపడి, అందరూ చూస్తుండగానే అతడిపై దాడి చేశారు. గతంలో కూడా వీరిపై అభ్యంతరకరమైన వీడియోలు చేయడం, స్థానికులతో గొడవలు పడటం వంటి ఆరోపణలున్నాయి. గత ఆగస్టులో జరిగిన జాతరలోనూ వీరి రచ్చ వైరల్ అయింది. తాజాగా జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన 36 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.