మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు తీర్పు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్‌లో కొత్త బడ్జెట్‌లో లక్షలాది ఇళ్లు పేదలకు ఇస్తామని, నల్గొండ జిల్లాపై కోపంతో ఎస్‌ఎల్‌బీసీని పక్కనపెట్టారని, నల్గొండ ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగడానికి బీఆర్‌ఎస్ కారణమని, కేసీఆర్‌కు పోలీసులు నోటీసు ఇస్తే తెలంగాణ జాతికి ఇచ్చినట్టు చెబుతున్నారని సీఎం విమర్శించారు.