సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

3244చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
TG: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, రహదారుల విస్తరణపై వ్యక్తిగత చొరవ చూపాలని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చర్లపల్లి స్టేషన్ కు రోడ్డు సదుపాయం మెరుగుపరచాలని, సికింద్రాబాద్ స్టేషన్ వద్ద రహదారి విస్తరణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగర రవాణా వ్యవస్థ మెరుగుపడాలంటే రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్