TG: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ వద్ద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పవన్ స్పందిస్తూ ఆరోపణలు నిరూపిస్తే ఆ భూమి ప్రభుత్వానికే అప్పగిస్తానని అన్నారు. దీంతో పవన్ 'కోడి చెరువు' కబ్జా ఆరోపణలపై రేవంత్ సర్కార్ విచారణ చేపడుతుందా? అనే చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.