భూరికార్డులు పౌరసత్వానికి కచ్చితమైన రుజువులు కావని కలకత్తా హైకోర్టు తాజాగా పేర్కొంది. విదేశీయులు కూడా భారత్‌లో భూమి కొనుగోలు చేయొచ్చని, భూమి కొన్నంత మాత్రాన పౌరులు అయిపోరని తెలిపింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నసీర్ ముల్లా కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. నసీర్ తరఫు న్యాయవాది భూరికార్డులు సమర్పించగా, అవి పౌరసత్వానికి రుజువులు కావని కోర్టు స్పష్టం చేసింది. ఇతర డాక్యుమెంట్స్ సమర్పించేందుకు జులై 20 వరకు గడువు ఇచ్చింది.