TG: రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన భూముల విలువలు జూన్ 4 నుంచి అమలులోకి వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించి శాస్త్రీయ పద్ధతిలో కొత్త విలువలను నిర్ణయించామన్నారు.