TG: రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు జూన్ 5 నుంచి అమలులోకి రానున్నాయి. బహిరంగ మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను హేతుబద్ధీకరించే ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు వంటి అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు పెరిగిన ధరల ప్రకారం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.