తెలంగాణలో భూముల విలువ 20 శాతం పెంపు!

2512చూసినవారు
తెలంగాణలో భూముల విలువ 20 శాతం పెంపు!
తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను పెంచే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రజలపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా, ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం సూచనల మేరకు ఈ పెంపును దశలవారీగా అమలు చేయాలని యోచిస్తోంది. తొలి విడతలో సగటున 20% మేర విలువల పెంపును అమలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులను బట్టి 2, మూడు విడతల్లో మిగిలిన పెంపును చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. భూముల విలువలపై అధ్యయనం చేసిన అరవింద్ సుబ్రహ్మణ్యం బృందం మే 10 తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

సంబంధిత పోస్ట్