భారీ వర్షానికి విరిగిపడిన కొండచరియలు.. తప్పిన ప్రమాదం

12482చూసినవారు
శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై గురువారం పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా జలాశయం దిగువన ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ బండరాళ్లు పడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చర్చించుకుంటున్నారు. రోడ్డుపై కొండచరియలు, బండరాళ్లు తొలగించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్