సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగర సరిహద్దులో గురువారం సాయంత్రం ఒక ప్రైవేటు వ్యర్థ నిర్వహణ కేంద్రం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. 36 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు. రక్షణ దళాలు సహాయక చర్యలు చేపట్టి, దాదాపు రెండు రోజులుగా శిథిలాల తొలగింపు కొనసాగిస్తున్నాయి. కొందరు జీవించి ఉన్నట్లు గుర్తించామని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.