భారత్‌కి చేరుకున్న చివరి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లు

0చూసినవారు
భారత్‌కి చేరుకున్న చివరి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లు
భారత సైన్యం కోసం అమెరికా నుంచి రావాల్సిన AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్ల చివరి బ్యాచ్ భారత్ చేరుకుంది. ఈ రాకతో భారత సైన్యం ఆర్డర్ చేసిన మొత్తం ఆరు అపాచీ హెలికాప్టర్ల సరఫరా పూర్తయింది. వాస్తవానికి ఫిబ్రవరి-మార్చి నాటికే రావాల్సిన ఈ హెలికాప్టర్ల సరఫరా పలుమార్లు జాప్యం చెందింది. తాజాగా వచ్చిన మూడు హెలికాప్టర్లతో కలిపి మొత్తం ఆరు అపాచీలను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కేంద్రంగా మోహరించనున్నారు. ఈ హెలికాప్టర్లు అత్యాధునిక సెన్సార్లు, లాంగ్‌బౌ ఫైర్ కంట్రోల్ రాడార్, హెల్‌ఫైర్ క్షిపణులు, నైట్ విజన్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.