నటి రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 21న 'థామా' సినిమాతో, నవంబర్ 7న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, రష్మిక ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటి ప్రేమ ప్యూర్ కాదని, చివరి ప్రేమ మాత్రమే ప్యూర్ గా ఉంటుందని ఆమె తెలిపారు. ప్రేమలో అసూయ ఉండదని కూడా ఆమె పేర్కొన్నారు.