
పోలీసుల తీరుపై మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం
పల్నాడు జిల్లాలో పోలీసుల తీరుపై మంత్రి విడదల రజిని తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ నాయకుల మెప్పు కోసం తమపై, కుటుంబంపై, అనుచరులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, బెదిరింపులకు ఎవరూ భయపడరని ఆమె ఆరోపించారు. ఇప్పటికే ఏడు తప్పుడు కేసులు పెట్టారని, తనను, తన వారిని లక్ష్యంగా చేసుకున్న వారిని వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు. రాజకీయంగా మహిళలు ఎదగడం కొందరికి నచ్చడం లేదని ఆరోపించారు. నిష్పక్షపాత విచారణ జరగాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.




