తెలంగాణలో శాంతిభద్రతలు అడుగంటిపోయాయని, రాజధాని హైదరాబాద్ పోక్సో కేసులకు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఖమ్మం ఘటనలో సెటిల్‌మెంట్ కోసం
కాంగ్రెస్ నేతలు ప్రయత్నించినా, కేసు నమోదు చేయడం అభినందనీయమని, అయితే మంత్రి సీతక్క ఆ బాలికను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో రీల్స్ చేసే మంత్రి సీతక్క.. మైనర్ బాలికల గురించి కూడా రీల్స్ చేయాలని ఎద్దేవా చేశారు.