
భూమి వివాదం: తల్లిదండ్రులపై కొడుకులు కర్రలతో దాడి! (వీడియో)
మహారాష్ట్రలోని ఇందాపూర్ (తరంగ్ వాడీ) వద్ద భూమి వివాదం కారణంగా ఆగస్టు 30న తల్లిదండ్రులపై కన్న కొడుకులు కిరాతక దాడికి పాల్పడ్డారు. సంజయ్, రాజేంద్ర అనే ఇద్దరు కొడుకులు తమ తల్లి పేరు మీద ఉన్న భూమిని అమ్మేశారనే కోపంతో, 65 ఏళ్ల తుకారాం, ఆయన భార్య అంజనాలను కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి, ఇద్దరు కొడుకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




