CJI గవాయ్ పై దాడికి యత్నించిన లాయర్ సస్పెండ్

13930చూసినవారు
CJI గవాయ్ పై దాడికి యత్నించిన లాయర్ సస్పెండ్
CJI BR గవాయ్ పై ఓ లాయర్ దాడికి యత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆయనపై షూ విసిరేందుకు యత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్ ను సస్పెండ్ చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఏ కోర్టు, ట్రిబ్యునల్, లేదా లీగల్ అథారిటీలో ప్రాక్టీస్ చేయకుండా వేటు వేసింది. తదుపరి చర్యల కోసం షోకాజ్ నోటీస్ జారీ చేయనుంది. ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత 15రోజుల్లోగా తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో లాయర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్