
మహీంద్రా థార్ కొత్త వెర్షన్ విడుదల.. రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ దేశీయ మార్కెట్లోకి సరికొత్త థార్ మాడల్‌ను విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తున్న ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.16.99 లక్షల వరకు ఉంటుంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేలా కీలక మార్పులతో రూపొందించిన ఈ కొత్త థార్‌లో 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్‌లో10.25 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.




