
ఇస్రో ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాల ఆందోళన
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రాకెట్ల తయారీ, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ రంగానికి అప్పగించే ప్రతిపాదనలపై ఇస్రోలోని తొమ్మిది ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు సెప్టెంబర్ 4న ఇస్రో చైర్మన్ వి.నారాయణన్‌కు లేఖ రాశాయి. సంస్థ భవిష్యత్ పాత్ర, ఉద్యోగుల భవితవ్యంపై ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, కీలక బాధ్యతలను ప్రభుత్వ చేతుల నుంచి ప్రైవేట్ సంస్థలకు అప్పగించి, ఇస్రోను కేవలం పరిశోధన & అభివృద్ధి విభాగానికే పరిమితం చేసే విధానాన్ని అంగీకరించలేమని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.




