మహారాష్ట్రలోని హింజవాడి ఐటీ పార్కు సమీపంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఐటీ పార్కుకు కొద్ది దూరంలో ఉన్న కసారసాయి గ్రామంలో ఒక చిరుతపులి సంచరిస్తూ కనిపించింది. ఈ దృశ్యం ఒక నివాస సముదాయం వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరుత కనిపించడంతో స్థానిక నివాసితుల్లో భయాందోళన నెలకొంది.