నాగ్‌పూర్‌లో చిరుత కలకలం.. ఏడుగురిపై దాడి (VIDEO)

0చూసినవారు
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని శివ్‌నగర్ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అకస్మాత్తుగా రోడ్డుపైకి దూసుకొచ్చిన చిరుత స్థానికులపై దాడి చేసి ఏడుగురిని గాయపరిచింది. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మత్తుమందు ప్రయోగించి చిరుతను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్