తిరుపతిలో శుక్రవారం తెల్లవారుజామున చిరుత పులి సంచారం కలకలం రేపింది. అలిపిరి జూపార్క్ రోడ్ సమీపంలో భక్తులకు కనిపించిన చిరుతను కారులో వెళ్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టీటీడీ అధికారులు అప్రమత్తమై, చిరుత కనిపించిన ప్రాంతాన్ని పరిశీలించి, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్డులో కూడా చిరుతల సంచారంపై నిఘా పెట్టాలని భక్తులు కోరుతున్నారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.