రెప్పపాటులో చిన్నారిని ఎత్తుకెళ్లిన చిరుత పులి (వీడియో)

0చూసినవారు
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా దెడ్కియాల్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారి ప్రిషా సోలంకిని ఒక చిరుతపులి రెప్పపాటులో ఈడ్చుకెళ్లి కిరాతకంగా చంపేసింది. ఇందుకు సంబంధించిన భయాందోళనకర సీసీటీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరుసటి రోజు పొలాల్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. చిరుతను బంధించేందుకు రెస్క్యూ సిబ్బంది 8 బోన్లు ఏర్పాటు చేశారు. కాగా, గుజరాత్ అడవుల్లో దాదాపు 2,600 చిరుతలు ఉన్నట్లు అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్