శ్రీశైలం మండలం సున్నిపెంట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో రెండు చిరుతలు సంచరించాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ సంఘటనతో
విద్యార్థులు, సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.