తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వివాహిత మరో మహిళతో ఎఫైర్ పెట్టుకుని, తమ ప్రైవసీకి అడ్డుగా ఉందని భావించి 6 నెలల బిడ్డను చంపేసింది. బిడ్డ మరణించినప్పుడు అనారోగ్యం అనుకుని పోస్టుమార్టం లేకుండానే పూడ్చిపెట్టారు. తాజాగా భర్త, తన భార్య ఫోన్‌లో లెస్బియన్ చాటింగ్‌ను గుర్తించి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో శుక్రవారం పోలీసులు బిడ్డ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సమాచారం.