బెంగాల్‌‌‌‌ లెక్క తెలంగాణలోనూ గెలుద్దాం: నితిన్‌‌‌‌ నబీన్‌‌‌‌

5163చూసినవారు
బెంగాల్‌‌‌‌ లెక్క తెలంగాణలోనూ గెలుద్దాం: నితిన్‌‌‌‌ నబీన్‌‌‌‌
తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఏటీఎంలా వాడుకుందని, కాంగ్రెస్ ఆ అవినీతిని కప్పిపుచ్చుతోందని బీజేపీ నేత నితిన్‌‌‌‌ నబీన్‌‌‌‌ ఆరోపించారు. ఆదివారం రంగారెడ్డి రూరల్ జిల్లాతో సహా 9 జిల్లా బీజేపీ కార్యాలయాలను ప్రారంభించిన ఆయన, బెంగాల్‌‌‌‌లో ఎదుర్కొన్న హింసలను అధిగమించి కమలం వికసించినట్లే తెలంగాణలోనూ పునరావృతం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, ప్రజా పోరాటాల ద్వారా ఎండగట్టాలని, గ్రామ గ్రామాన కార్యకర్తలు కదలాలని పిలుపునిచ్చారు. కుల పిచ్చి బంద్ చేయాలని, పార్టీ ఫస్ట్, లీడర్ నెక్స్ట్ అని గుర్తుంచుకోవాలని నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్