పోషకాలు, ఐరన్ సమృద్ధిగా ఉండే పాలకూరకు డిమాండ్ ఎల్లప్పుడూ అధికంగానే ఉంటుంది. అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చే ఈ పంటను ఉష్ణ మండల, సమశీతోష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. ఈ పంటకు నేల తేలికగా, నీరు సులభంగా పారేలా ఉండాలి. విత్తనాలను 20 సెం.మీ. దూరంలో నాటితో, వారంలో మొలకలు వస్తాయి. 15–20 రోజుల్లో పంట కొతకు సిద్ధమవుతుంది. పశువుల ఎరువులు వాడి, సరైన పద్ధతిలో సాగు చేస్తే పాలకూర మంచి ఆదాయం తెస్తుంది.