తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేరుస్తూ, కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ పథకం కింద పేదింటి యువతులకు రూ. లక్ష నగదుతో పాటు ఒక తులం బంగారం అందించనుంది. ఈ పథకం SC, ST, BC, EBC, మైనారిటీ వర్గాలకు చెందిన, తెలంగాణలో స్థిరపడిన అర్హులైన యువతులకు వర్తిస్తుంది. దరఖాస్తుదారు తెలంగాణ నివాసి అయి ఉండాలి, వధువుకు 18 ఏళ్లు నిండి ఉండాలి, కుటుంబ వార్షికాదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలి. ఇది మొదటి వివాహం చేసుకునే యువతులకు మాత్రమే వర్తిస్తుంది.