విశాఖ తీరంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించిన లైఫ్‌గార్డ్స్‌

8711చూసినవారు
AP: విశాఖపట్నం తీరంలో నోవాటెల్‌ హోటల్‌ సమీపంలో శనివారం సముద్రంలోకి దిగిన రాయ్‌పుర్‌కు చెందిన పర్యాటకుడు అలల తాకిడికి లోపలికి కొట్టుకుపోయాడు. గమనించిన జీవీఎంసీ లైఫ్‌గార్డ్స్‌ వెంటనే అప్రమత్తమై అతడి ప్రాణాలను కాపాడారు. బయటకు తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, అపస్మారకస్థితిలోకి వెళ్లిన పర్యాటకుడిని మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్