ఇంటిపై ఒక్కసారిగా పడ్డ పిడుగు (వీడియో)

36చూసినవారు
AP: అన్నమయ్య జిల్లా రామపురం మండలం చిట్లూరులో మంగళవారం రాత్రి పిడుగుపాటు కలకలం రేపింది. గ్రామానికి చెందిన మాలపల్లి చంద్రయ్య అనే వ్యక్తి ఇంటిపై ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టు పూర్తిగా దగ్ధమైంది. పిడుగు పడిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ప్రమాద సమయంలో చంద్రయ్య ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్